సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Saturday, November 27, 2010

శ్రీ పరాశర సంహితా (శ్రీ ఆంజనేయ చరిత్ర)

శ్రీ పరాశర సంహితా (శ్రీ ఆంజనేయ చరిత్ర)



శ్రీరాముని చరిత్రకు రామాయణ మెలా ముఖ్యమో, శ్రీకృష్ణ చరిత్రకు భాగవతమెలాగో, శ్రీ హనుమచ్చరిత్రకు ఈ పరాశరసంహిత అలా శరన్యమైనది. కావున ప్రతిభక్తుడూ దీనిని తప్పక చదివి అందలి హనుమద్విషయా లన్నీ గ్రహించాలి. హనుమంతునకు సంబంధించిన సర్వయుగాల సమగ్రచరిత్రతోబాటు హనుమత్ సంబంధమయిన మంత్రభాగము, తంత్రభాగము, వివిధ స్తోత్రాలు, జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన విద్యలు, ఒకటనేల? సమస్త విషయాలూ ఇందులో ఉన్నాయి. దీనిని ఇంటనుంచుకొనుట హనుమంతుని ఇంటనుంచుకొనుటే. దీనిని పారాయణముగావించుట, పూజించుట కూడా హనుమంతుని అనుగ్రహాన్ని పొందజేస్తాయి. శ్రీపరాశర మహర్షి స్వయముగా
                         ‘పూజయేత్ పుస్తకం ధన్యః – స మర్త్యో ముక్తిమాన్ భవేత్’ (19-57)
                          ‘పుస్తకస్యాపి పూజనం – అపమృత్యుం తరిష్యతి’ (25-23)
అని చెప్పుటవలన హనుమన్ మంత్రశాస్త్రమైన ఈ పరాశరసంహితా గ్రంధాన్ని పూజించుటకూడా హనుమ దనుగ్రహించే ముక్తి నీయగలదని తెలుపబడింది. కాబట్టి ప్రతి భక్తుడూ ఈ గ్రంధాన్ని పూజాగృహంలో ఉంచుకొనుటద్వారా కూడా హనుమంతుని అనుగ్రహహం పొందవచ్చును.



The book was Wriiten by Dr. Annadanam Chidambara Sastry

No comments:

Post a Comment